ETV Bharat / state

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ - Amberpet auto driver news

ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. తన వాహనంలో మరిచిపోయిన బ్యాగును పోలీసుల సమక్షంలో బాధితులకు అప్పగించి ప్రశంసలు పొందాడు. ఈ ఘటన హైదరాబాద్​ అంబర్​పేట ఠాణాలో చోటుచేసుకుంది.

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
author img

By

Published : Feb 26, 2021, 5:25 PM IST

హైదరాబాద్​ అంబర్​పేటలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. రఫీ తన కుటుంబంతో అంబర్​పేట్​కు ఓ ఫంక్షన్​కు వచ్చాడు. తరువాత తిరిగి చార్మినార్​కు వెళ్లే క్రమంలో ఆటోలో బ్యాగ్ మరిచిపోయాడు. వెంటనే రఫీ అంబర్​పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా ఆటోను గుర్తించి ఫోన్ చేశారు.

అప్పటికే స్పందించిన డ్రైవర్ ఆటోలో మరిచిపోయిన బంగారాన్ని అంబర్​పేట్ పోలీస్​స్టేషన్​లో పోలీసుల సమక్షంలో బాధితులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. బ్యాగులో 3 తులాల బంగారం, రూ. 5వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్​ను మలక్​పేట ఏసీపీ వెంకట రమణ అభినందించి బహుమానంగా రూ. 2,000 ఇచ్చారు.

డ్రైవర్​కు అభినందన
డ్రైవర్​కు అభినందన

ఇదీ చదవండి: పోలీసుల తీరుపై డీజీపీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.