రైల్వే శాఖ సిబ్బంది ఆరోగ్య రికార్డులను ఆన్లైన్ చేస్తూ హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ఆసుపత్రికి వెళ్లే వైద్య పరీక్ష నుంచి మందులు తీసుకుని బయటకు వచ్చేదాకా ఎక్కడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన చికిత్స పొందేలా ఈ విధానం దోహదం చేయనుంది.
రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో భారతీయ రైల్వే ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మక ప్రాజెక్టును లాలాగూడలోని కేంద్రీయ ఆసుపత్రిలో శుక్రవారం ప్రారంభించారు. తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఆసుపత్రుల్లోకి విస్తరించనున్నారు. దమ రైల్వే జీఎం గజానన్ మల్యా సమక్షంలో రైల్వే హెల్త్ సర్వీసెస్ డీజీ డా బి.పి.నందా వర్చువల్‌గా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఇదీ చూడండి : పీసీసీ కొత్త బాస్ కోసం మూడో రోజూ అభిప్రాయసేకరణ