ETV Bharat / state

Amrit Bharat Station Scheme : 'రూ.300 కోట్లతో హైదరాబాద్ నుంచి యాద్రాద్రికి ఎంఎంటీఎస్‌' - తెలంగాణలో ఉన్న అమృత్ భారత్ రైళ్లు

Amrit Bharat Station Scheme : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్ అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Amrit Bharat Station Scheme in Telangana
Amrit Bharat Station Scheme
author img

By

Published : Aug 6, 2023, 1:16 PM IST

Amrit Bharat Station Scheme in Telangana : రాష్ట్రంలోని 21 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ కింద రాష్ట్రంలో రూ.898 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్, హైటెక్‌సిటీ, హఫీజ్​పేట, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, తాండూరు, రామగుండం, రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందనున్నాయి.

Kishanreddy Comments at Nampally Amrit Bharat Station Programme : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్ అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయన్న ఆయన.. 2014 నుంచి 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ 17 రెట్లు పెరిగిందన్నారు. హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్​ను రూ.3 వందల కోట్లతో నిర్మించబోతున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రీజినల్‌ రింగ్​రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్​ఆర్ఆర్​ నిర్మాణం కోసం కేంద్రానికి.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని ఆరోపించారు.

Amrit Bharat Station Scheme in TS : రైల్వే స్టేషన్ల ఆధునీకరణ.. దేశవ్యాప్తంగా 508.. రాష్ట్రంలో ఎన్నో తెలుసా?

'2 వేల కి.మీ.కు పైగా రైల్వేలైన్స్ కోసం రాష్ట్రంలో సర్వే చేశాం. రూ.300 కోట్లతో హైదరాబాద్ నుంచి యాద్రాద్రికి ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి తెస్తాం. సికింద్రాబాద్‌ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు ఇచ్చాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లోపు పూర్తి చేస్తాం. రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాం. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సహకరించట్లేదు. నిధులు ఇస్తామన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయడం లేదు.'-కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay Attends Amrit Bharat Station Programme in Karimanagar : కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ శంకుస్థాపనకు.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్డీవో మినహా... ఇతర అధికారులు హాజరుకాకపోవడం దారుణమని బండి సంజయ్‌ అన్నారు. అధికార యంత్రాంగంపై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం, కరీంనగర్‌ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. రెండో దశలో పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధి కోసం రూ.20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాల కల్పన : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం సహా రైల్వేస్టేషన్లు కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే... అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యమని... పీఎంవో వెల్లడించింది. ఈ పథకంలో ప్రణాళిక ప్రకారం సౌకర్యాల కల్పనతో పాటు అనవసర నిర్మాణాలు తొలగించనున్నారు. మెరుగైన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. సకల వసతులతో ఆయా రైల్వే స్టేషన్​లను తీర్చిదిద్దనున్నారు.

New Trains Stops in Telangana : తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ స్టేషన్​లలోనూ..!

KishanReddy on Telanana Floods : 'వరదలతో జనం అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది'

Kishan Reddy Fires on CM KCR : 'కేసీఆర్‌.. రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.