ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, రాజధాని ఐకాస కన్వీనర్ సుధాకర్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తుళ్లూరులో దీక్షలకు హాజరయ్యారు. సుమారు 20 మంది మహిళలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నేతలు వారికి పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేతలు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు రాజధానిగా అమరావతిని పరిరక్షించుకుందామని నేతలు చెప్పారు. విశాఖ వాసులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాలలో విశాఖ వాసులు.. రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: 'కాళేశ్వరం జలాలతో హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం'