సచివాలయం సమీపంలో కాలిబాటపై చెప్పులు కుట్టే ఈ కార్మికుడి పేరు మల్లేష్. ఖైరతాబాద్ నివాసి. అందరి కాళ్లకు పాదరక్షలు అమర్చే ఈయన పాపం నడవలేడు. అనారోగ్యం కారణంగా 12 ఏళ్ల కిందట అతడి రెండు కాళ్లూ తొలగించారు. మల్లేష్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వ పాఠశాలలో 4, 5 తరగతులు చదువుతున్నారు. తను కూర్చుని చేయగల ఈ వృత్తిని ఎంచుకుని సొంతకాళ్లపై నిలిచారాయన. ప్రభుత్వం దివ్యాంగుల పింఛనుగా నెలకు రూ. 3 వేలు ఇస్తున్నా... ఇంటి అవసరాలకు అవస్థ పడాల్సి వస్తోందని వాపోతున్నాడు మల్లేష్.
ఇవీ చూడండి: 'నా కూతురి ఆత్మకు శాంతి చేకూరింది'