ETV Bharat / state

Amit Shah Tour Cancelled : రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా.. అదే కారణం! - Amit Shah visits cancelled

Amit Shah Telangana Tour Cancelled : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అమిత్ షా పర్యటన రద్దు అయింది. ఈ నెల 29న ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. త్వరలోనే అమిత్ షా పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది తెలియజేస్తామని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Amit Shah
Amit Shah
author img

By

Published : Jul 27, 2023, 10:15 PM IST

Updated : Jul 28, 2023, 6:46 AM IST

Amit Shah Telangana Tour Postponed : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 29న పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు సామాజిక వర్గాలతో సమావేశమయ్యేందుకు ఆయన పర్యటన ఖరారైంది. కానీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అమిత్‌ షా పర్యటన వాయిదా వేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే అమిత్‌ షా పర్యటన ఎప్పుడు ఉండేది తెలియజేస్తామని వెల్లడించాయి.

Priyanka Gandhi Telangana Visit : మరోవైపు ఏఐసీసీ అధినేత ప్రియాంక గాంధీ.. తెలంగాణ పర్యటనపై భారీ వర్షాల ప్రభావం పడనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న కొల్లాపూర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆమెను ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నెల 20న జరగాల్సిన సభను.. ప్రియాంక గాంధీ కోసం 30కి వాయిదా వేశారు.

కానీ ఇప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలు ఇలాగే కొనసాగితే ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సభ ఉంటుందా లేదా అనే గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటి వరకు పార్టీ ముఖ్య నేతలు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Palamuru Praja Bheri in NagarKurnool : మరోవైపు కొల్లాపూర్ వేదికగా జరిగే పాలమూరు ప్రజాభేరిలో పలువురు కీలక నాయకులు.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి.. కాంగ్రెస్‌లో చేరాలనుకే నేతలంతా.. కొల్లాపూర్ సభలోనే అగ్రనాయకుల సమక్షంలో హస్తం పార్టీలోకి రానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించి.. అధికారంలోకి వస్తే అర్హులైన ఆసరా లబ్దిదారులందరికీ పింఛన్లు రూ.4,000 చేస్తామని హామీ ఇచ్చింది. ఇదే తరహాలో పాలమూరు ప్రజాభేరిలోనూ ప్రజాకర్షక ఎన్నికల హమీలను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి : Khammam Congress Meeting : 'BRSకు భయం పుట్టింది.. అందుకే ఈ అడ్డగింత'

Political Heat in Khammam : ఖమ్మం గుమ్మంలో రాజుకుంటున్న రాజకీయం

Last Updated : Jul 28, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.