ఏపీ అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 289వ రోజుకు చేరుకుంది. తుళ్లారు, వెలగపూడి, మందడం, ఐనవోలు, లింగాయపాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, నెక్కల్లు, నేలపాడు, గ్రామాల్లో రైతులు ఆందోళను కొనసాగించారు. నెక్కల్లులో గురువారం నుంచి దీక్షను ప్రారంభించారు. ప్రజాగాయకులు రమణ.. చిన్నారులతో కలసి ఉద్యమ గీతాలు పాడారు.
మందడంలో సాయి కీర్తన చేస్తూ అక్కడి రైతులు నిరసన తెలిపారు. లింగాయపాలెంలో హనుమాన్ చాలీసా చదువుతూ ప్రార్థనలు చేశారు. కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతులకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చెందిన తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు ఉద్యమానికి సంఘీభావంగా తమ ప్రాంతంలోనూ ఐకాస ఏర్పాటు చేశామని నేతలు చెప్పారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు