Amala Akkineni : పెంపుడు కుక్కలకు మంచి శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ సొసైటీ కార్యకర్త అక్కినేని అమల అన్నారు. పెట్స్‌కి శిక్షణ ఇవ్వడం వలన అందరికి ప్రయోజనం ఉంటుందని.. తద్వారా ప్రతి ఒక్కరు కుక్కలను ఇష్టపడతారని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పెంపుడు కుక్కల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 'డాగీ విల్లే-ది కెెనైన్' క్లబ్‌ను అమల ప్రారంభించారు.
Dogs Ville.. The Canine Club : పెంపుడు కుక్కలకు ప్రత్యేక శిక్షణతో పాటు ప్లేజోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కరోనా వంటి ఈ సమయంలో ఇలాంటి సెంటర్ చాలా అవసరమని చెప్పారు. బ్లూక్రాస్ సొసైటీ ద్వారా వీధి కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తున్నట్లు అమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలతో పాటు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.
'డాగీ విల్లే పెట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువులకు బాగా ట్రైనింగ్ ఇచ్చి.. పెంచితే అది అందరికీ ఉపయోగం. సరిగా పెంచకపోతే న్యూసెన్స్ చేస్తుంది. చాలామందికి అవి అంటే అయిష్టం ఏర్పడుతుంది. పెట్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌గా భావించాలి. వీధికుక్కలకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించి.. రేబిస్ రాకుండా టీకా ఇస్తున్నాం. నెలకు వెయ్యి కుక్కలకు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల సిటీలో వీధికుక్కలు బాగా తగ్గిపోయాయి.
-అమల, బ్లూ క్రాస్ కార్యకర్త
ఇదీ చదవండి: మధ్యాహ్నం రమేశ్‌బాబు అంత్యక్రియలు.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరి