ETV Bharat / state

'కారుణ్య మరణాలకు అనుమతించండి' - COURT

గురుకుల పాఠశాల లైబ్రేరియన్​ పోస్టులకు ఎంపికైన 247 మంది అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్​ తలుపు తట్టారు. వెంటనే నియామక పత్రాలు అందజేయాలని కోరారు. లేకుంటే కారుణ్య మరణాలకు అనుమతించాలని వారు డిమాండ్​ చేశారు.

'కారుణ్య మరణాలకు అనుమతించండి'
author img

By

Published : Apr 3, 2019, 9:56 PM IST

'కారుణ్య మరణాలకు అనుమతించండి'
గురుకుల పాఠశాల లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన 247 మంది అభ్యర్థులు నియామక పత్రాలు తక్షణమే ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. అలా జరగని పక్షంలో కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రెండేళ్లుగా ఉద్యోగాల్లో చేరడానికి ఎదురుచూస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నామన్నారు. నలుగురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వల్ల ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జోక్యం చేసుకోవాలి:

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్​ జోక్యం చేసుకొని టీఎస్పీఎస్​ ద్వారా త్వరగా కోర్టు కేసులను పరిష్కరింపజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ నెల 30 లోపు పరిష్కరించకపోతే ప్రగతి భవన్​ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:సౌకర్యాలు శూన్యం... ఫీజు మాత్రం అధికం

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.