ETV Bharat / state

'ఉస్మానియాలో ఆస్పత్రిలో అన్ని జాగ్రత్తలు చేపట్టాం' - ఉస్మానియాలో ఓపీ సేవలు

లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్, వాహనాలకు అనుమతి లేకపోవటం సహా వివిధ కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నా... ఇళ్లకే పరిమితమైన వారు ఇప్పుడు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఓపీకి వస్తున్న వారి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు సహా వివిధ అంశాలపై ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ భారత్‌ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

osmania hospital
osmania hospital
author img

By

Published : May 20, 2020, 7:37 PM IST

ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేంద్రతో ఈటీవీ భారత్ ముఖాముఖి

చాలాకాలం తర్వాత ఓపీ, ఎలక్ట్రిక్ సర్జరీలను ప్రారంభిచారు కదా. కొవిడ్ సమయంతో పోలిస్తే ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎలా ఉంది?

గతంతో పోలిస్తే కొవిడ్ సమయంలో రోగుల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఓపీ సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించాం. లాక్ డౌన్ సమయంతో పోలిస్తే వాహనాలకు అనుమతి ఇవ్వటంతో 200 నుంచి 300 మంది అధికంగా ఆస్పత్రికి వస్తున్నారు. మరింత పెరిగే అవకాశం ఉంది.

లాక్ డౌన్‌కు ముందు ఓపీ కోసం ఎంతమంది వచ్చేవారు. లాక్ డౌన్ సమయంలో ఓపీ రోగుల సంఖ్య ఎలా ఉంది. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు?

సాధారణంగా 2000 నుంచి 2500మంది ఓపీకి వచ్చే వారు. 150 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు చేసేవాళ్లం. లాక్ డౌన్ సమయంలో 500 నుంచి 700మంది ఓపీ, 30 నుంచి 40 ఎమర్జెన్సీ కేసులు వచ్చేవి. గాంధీని కూడా కొవిడ్ ఆస్పత్రి చేయటం వల్ల ఓపీ ఇప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ సర్జరీలను ఇప్పుడు తిరిగి ప్రాంభించారు. మరి ఈ కేసుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

నిన్నటి నుంచే ఓపీ ప్రారంభమైన నేపథ్యంలో ఎలక్ట్రిక్ సర్జరీలకు సంబంధించిన రోగులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వారిని ఆస్పత్రిలో జాయిన్ చేసుకుని పరీక్షలు చేశాక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది.

ప్రతి రోగిని ఇప్పుడు కొవిడ్ పాటిజివ్ కేసుగానే భావించి.. జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో శస్త్రకిత్సలు నిర్వహించే థియేటర్లలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ?

డాక్టర్లకు పీపీఈ కిట్స్ ఇస్తున్నాం. రోగులకు వ్యక్తిగత శుభ్రతమీద అవగాహన కల్పిస్తున్నాం. మాస్కు ధరించినవారినే అనుమతిస్తున్నాం.

ఇప్పుడు ఉస్మానియాకు వచ్చే రోగులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

గతంలో ఫీవర్ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. కొవిడ్ లక్షణాలతో వచ్చిన వారిని అక్కడికి పంపి చికిత్స అందిస్తాం. ఫలితంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

వైద్యులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సి ఉంది. ఇందుకోసం ఏమైనా ఆదేశాలు ఇచ్చారా?

కొవిడ్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రుల సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు రావాలని డీఎంఈ ఆదేశాలను జారీ చేశారు. దాని ప్రకారం రేపటి నుంచి అందరు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.

బయో వేస్ట్, పీపీఈ కిట్ల డిస్పోజ్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

దీనికి సంబంధించి ఓ సంస్థతో ఇప్పుటికే ఒప్పందం చేసుకున్నాం. ఇందుకోసం కొంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా బయోమెడికల్, పీపీఈ కిట్ల డిస్పోజ్‌ చేస్తున్నాం.

గడిచిన రెండు నెలల్లో ఏ మేరకు సర్జరీలు చేశారు?

సాధారణంగా అయితే రోజుకి 150 నుంచి 200 శస్త్రచికిత్సలు చేసేవాళ్లం. లాక్ డౌన్ సమయంలో కేవలం 30 నుంచి 40 శస్త్రచికిత్సలు చేశాం. ఇప్పుడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఆస్పత్రికి వచ్చే రోగులకు కొవిడ్ నివారణలో భాగంగా ఎలాంటి అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు?

నలుగురు ఆర్‌ఎంవోలను అందుబాటులో ఉంచుతున్నాం. పార్మసీ సహా అన్ని చోట్ల భౌతిక దూరం పాటించేలా చూస్తున్నాము. మాస్క్ లేనివారికి ఓపీ ఇవ్వడం లేదు. ప్రజలు కూడా ఇందుకోసం పూర్తిగా సహకరించాలని కోరుతున్నాం.

ఇదీ చదవండి: 6 అడుగుల దూరం చాలదు- వైరస్​కు స్పీడెక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.