జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా ఉందా అని పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది.
పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడం వల్ల వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది. వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు.
సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్