ETV Bharat / state

Hyd Formula E Race: రెడీ టు రైడ్... సాగరతీరంలో ఐఆర్‌ఎల్‌కు అంతా సిద్ధం - pharmula e car race in hyderabad

Hyd Formula E Race హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరం.. రయ్‌ రయ్‌ మంటూ ఇవాళ కార్ల మోతతో దద్దరిల్లనుంది.'ఫార్ములా-ఈ' కార్‌ రేసింగ్‌లో భాగంగా ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు ఇండియన్ రేసింగ్‌ లీగ్ జరగనుంది. ఇందుకోసం హుస్సేన్‌సాగర్‌ తీరం ముస్తాబైంది. 'ఫార్ములా-ఈ' రేసింగ్‌కు ముందస్తుగా ఆ వేడుక నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాల పాటు రేసింగ్ జరగనుంది.

కార్ల మోతతో దద్దరిల్లనున్న హుస్సేన్‌సాగర్‌ తీరం.. ఐఆర్‌ఎల్‌కు అంతా సిద్ధం

author img

By

Published : Nov 19, 2022, 9:48 AM IST

Hyd Formula E Race హైదరాబాద్‌లో నేడు ప్రతిష్ఠాత్మక కార్ రేసింగ్ జరగనుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో సాయంత్రం రేసింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ కార్ రేస్ ప్రిపరేషన్‌లో భాగంగా నేడు, రేపు ఇండియన్ రేసింగ్‌ లీగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోల్‌ కార్లతోనే జరగనున్న ఈ రేసింగ్‌.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 4 గంటల 45 నిమిషాలకు ముగియనుంది. ఈ రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. 50 శాతం దేశంలోని రేసర్లు.. మరో 50 శాతం విదేశీ రేసర్లు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ రేసింగ్‌తో ట్రాక్‌ పటిష్ఠతను పరీక్షించనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ చూసేందుకు 7,500 మంది వరకు గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోశ్‌ వెల్లడించారు.

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకులు పాలుపంచుకుంటున్నారు. మల్కాజిగిరికి చెందిన అభినవ్‌రెడ్డితో పాటు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు అనిందిత్‌రెడ్డి కార్ రేసులో తలపడనున్నారు. రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవమున్న అనిందిత్.. 2016 యూరో జేకే 16 ఛాంపియన్‌షిప్‌, 2017యూరో జేకే ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. గతంతో పోల్చితే రేసింగ్‌లో ఆధునాతన టెక్నాలజీతో వాహనాలు వచ్చాయని.. రక్షణ చర్యలు ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిపారు.

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ దృష్ట్యా నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 10, 11న మళ్లీ రెండో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగుతుంది. ఇందులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచ్చి బృందాలు తలబడనున్నాయి.

ఇవీ చూడండి..

ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్‌ రన్‌ కోసం హైదరాబాద్ చేరుకుంటున్న రేసర్లు

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్​ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.