మార్కులు రాకుంటే జీవితం అంతం కాదు.. మార్కులతోనే జీవితం మొదలు కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని బతికి కొట్లాడదాం అని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేవిధంగా ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎదిగిన పిల్లలను పోగొట్టుకోవడం కంటే ప్రపంచంలో పెద్ద విషాదం ఏమీ లేదని కృష్ణశాస్త్రి చెప్పిన విషయాలను కోదండరాం గుర్తు చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని వాళ్లకు అండగా అఖిలపక్షం ఉంటుందని భరోసా ఇచ్చారు.
'మార్కులు రాకపోతే జీవితం అంతం కాదు' - kodandaram
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో మనో ధైర్యం నింపేందుకు అఖిలపక్షం సంతాకాల సేకరణ చేపట్టింది. అన్ని రకాలుగా వారికి తోడుగా ఉంటామని కోదండరామ్ భరోసా ఇచ్చారు.