ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకల వల్ల మృతి చెందిన విద్యార్థిని అనామిక కుటుంబానికి అఖిలపక్ష పార్టీల నేతలు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతలు కోదండరాం, చాడ వెంకటరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అనామిక తల్లికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఇంటర్ బోర్డు బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నూతన భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తుందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ వంతుగా సహాయం చేయాలనుకునే వాళ్లు తెలంగీ పీపుల్స్ సొసైటీకి తమ విరాళాల్ని పంపిస్తే... బాధిత కుటుంబాలకు అందజేస్తామని స్పష్టం చేశారు. వచ్చే వారంలో మరో రెండు, మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం