ETV Bharat / state

దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం: విపక్ష నేతలు - తెరాసపై కాంగ్రెస్ ఆగ్రహం

తెరాస ప్రజాధనంతో శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుంటుందని విపక్ష నేతలు మండిపడ్డారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని... ఈ మేరకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.

దేశవ్యాప్త ఉద్యమానికైన సిద్ధం
author img

By

Published : Mar 23, 2019, 8:16 PM IST

Updated : Mar 23, 2019, 10:57 PM IST

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో హైదరాబాద్​లో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్​, కుసుమ కుమార్, తెదేపా నేతలు రమణ, రావుల, తెజస అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్​రెడ్డి పాల్గొన్నారు. ప్రజాగాయకుడు గద్దర్​తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.

ప్రతిపక్షాలుంటే ప్రభుత్వ అక్రమాలు బయటపడుతున్నాయనే దురుద్దేశంతోనే... ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులను కేసీఆర్ ఆకర్షిస్తున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రజాధనాన్ని ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి... శాసనసభ్యులను పార్టీలో చేర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులను కేసీఆర్ కంటే కేటీఆర్ మరింత ప్రోత్సహిస్తున్నారని తెతెదేపా నేత రావుల మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను తీవ్రపదజాలంతో దూషించిన కేసీఆర్... ఇప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని అఖిలపక్షం ప్రశ్నించింది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని... ఈ మేరకు దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.

ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఈ చర్చలో అఖిలపక్షం అభిప్రాయపడింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఖండించాలని నేతలు సూచించారు.

దేశవ్యాప్త ఉద్యమానికైన సిద్ధం

ఇదీ చూడండి: 'ఫిరాయింపులపై కాంగ్రెస్ న్యాయపోరాటం'

Last Updated : Mar 23, 2019, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.