Remembering Dharmabhiksham: అలుపెరగని పోరాట యోధుడు, నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు కట్టుబడిన మహానాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ధర్మభిక్షం చేసిన పోరాటలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన అరడుగుల ఎర్రజెండ ప్రజల మనిషి ధర్మభిక్షం గీతల సీడీతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ రాసిన ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్ర, బొమ్మగాని నాగభూషణం రాసిన ఉద్యమ సంతకం పుస్తకాలను ఆవిష్కరించారు.
ఇదే వేదికపై ఐదుగురు తెలంగాణ సాయుధ పోరాటయోధులను సత్కారించారు. ధర్మభిక్షం విద్యార్థి దశ నుంచే పోరాటలు చేశారని... ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులుగా ప్రజా గొంతుకై నిలిచారన్నారు. నిరంతరం ప్రజలతో కలిసి ప్రజా పోరాటలు చేసి ప్రజల మనిషి అయ్యారన్నారు. నిజాం నిరంకుశ వ్యతిరేక సాయుధ పోరాటం చేసిన యోధుడు అని పేర్కొన్నారు. సమాజమే తన కుటుంబంగా భావించిన మహోన్నతమైన వ్యక్తి అని కీర్తించారు.
ఇదీ చూడండి : భాజపాపై కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేవెగౌడ