ఇంటర్ బోర్డు చర్యల వల్ల విద్యార్థులు అభద్రతా భావంలో ఉన్నారని అఖిల పక్ష నేతలు ఆవేదన చెందారు. రాష్ట్రంలోని తాజా గందరగోళ పరిస్థితులను రాజ్భవన్లో గవర్నర్కు వివరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గవర్నర్ను కోరామని అఖిల పక్ష నేతలు తెలిపారు. ఈనెల 29న ఇంటర్ బోర్డు వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాడతామని వెల్లడించారు.
ఇదీ చూడండి: విజయవంతంగా రెండో మోటార్ ట్రయల్ రన్