ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష నేతలు జలసౌధలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, న్యూడెమొక్రసీ నేతలు రమ, అచ్యుత రామారావు, తెదేపా నేత కిశోర్.. కృష్ణా జలాల వినియోగంపై రజత్‌కుమార్‌తో చర్చించారు.
నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను కలిసి పోతిరెడ్డిపాడు వల్ల వచ్చే ఇబ్బందుల గురించి వివరించాం. కృష్ణ జలాల వినియోగంపై అనేక విషయాలు మాట్లాడాం. కృష్ణాజలాలు తెలంగాణకు శాపంగా మారే ప్రమాదం కనపడుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలు కృష్ణా జలాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. 203 జీవో ఉపసంహారించుకునే వరకు అఖిలపక్షం పోరాటం చేస్తుంది.
-చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!