సచివాలయం కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణంపై అఖిల పక్షం నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ , పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. అఖిలపక్షనేతలు వివేక్, ఆచార్య కోదండరామ్, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డితోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి:వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం