ETV Bharat / state

ఆకట్టుకున్న అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు - Impressive All-India Police Band performances

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో జరుగుతోన్న అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోలీస్​ బ్యాండ్ పోటీలు జరుగుతాయి.

All India Police Band performances
ఆకట్టుకున్న అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు
author img

By

Published : Feb 21, 2020, 11:26 PM IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ పదో ప్లాట్​ ఫామ్​ వద్ద నిర్వహించిన పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్లాట్​ ఫామ్​పై మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్, సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ విభాగాలు జాతీయ గీతానికి అనుగుణంగా సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో జరుగుతోన్న 20వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ఈనెల 19 తేదీ నుంచి 23 తేదీ వరకు జరుగుతాయి. పోటీల్లో భాగంగా నగరంలోని సికింద్రాబాద్, చార్మినార్, నెక్లెస్ రోడ్ వంటి ప్రదేశాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించారు. వినోదాన్ని నగరవాసులకు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ గార్డెన్​లో సీఆర్పీఏఫ్ దళం ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు నగర వాసులను ఆకట్టుకున్నాయి. తుది విజేతలను ఈ నెల 23వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించనున్నారు.

ఆకట్టుకున్న అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు

ఇదీ చూడండి: సమాజం మార్పునకు తయారు చేసిన ఆయుధమే 'కమ్యూనిస్ట్​ మానిఫెస్టో'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.