ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించునున్న ఈసెట్ (ECET) పరీక్ష ఇవాళ జరగనుంది. లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులకు ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
రెండు విడతల్లో పరీక్ష
రెండు విడతల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎస్ఈ, ఈసీఈ, ఈఐఈ, ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుందని కన్వీనర్ సిహెచ్. వెంకటరమణారెడ్డి తెలిపారు. సివిల్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, కెమికల్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం 24 వేల 808 మంది అభ్యర్థుల కోసం రాష్ట్రంలో 37.. ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: