Alai Balai Programme in Telangana : హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అలయ్ బలయ్ కార్యక్రమం(Alai Balai Programme) కన్నుల పండువగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం తర్వాత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Mizoram Governor Kambhampati Haribabu), రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆచార్య కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ పూర్వ అధ్యక్షుడు లక్ష్మణ్, కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. అతిధులందర్నీ తెలంగాణ సాంప్రదాయాలతో స్వాగతం పలికి కండువాలతో సత్కరించారు.
Political Leaders Attend Alai Balai Programme : అలయ్ బలయ్ కార్యక్రమంతో అందరితో స్నేహంగా మెలగాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ నాయకత్వంలో తెలంగాణ కళలను, ఆచారాలను నెమరు వేసుకోడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. దసరా పండగ ప్రజలందరికీ శుభం కలుగజేయాలని బీజేపీ(BJP) ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేెశారని తెలిపారు.
"అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా ఉంది. నాయకులు, వివిధ ప్రముఖుల అందరితో స్నేహంగా మెలగాలి. గత 17 సవంత్సరాలుగా దత్తాత్రేయ నాయకత్వంలో తెలంగాణ కళలు, ఆచారాలు జ్ఞాపకం తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Mizoram Governor in Alai Balai Programme : ఈ అలయ్ బలయ్ వేదిక ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది పడిందని లక్ష్మణ్ వెల్లడించారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని ఒకచోటికి చేర్చి అందరితో కలిసి మెలిసి భోజనం చేస్తూ, మన సంస్కృతీ సాంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ.. అందరిలో సుహృద్భావ వాతావరణాన్ని కలగజేయడంలో దత్తాత్రేయ విజయం సాధించారని.. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు.
ALAY BALAY at Hyderabad Exhibition Ground : అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. కళాకారుల డప్పు వాయిద్యాలతో కార్యక్రమం ఆధ్యంతం అతిధులను ఆకట్టుకుంది. అందరూ కలిసుండాలనే ఉద్దేశంతో ఒక తాటిపైకి చేర్చి.. దత్తాత్రేయ చేస్తున్న కృషిని ఆహూతులు ప్రశంసించారు. ఈ అలయ్‌బలయ్ కార్యక్రమం ఆధ్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఝార్ఖండ్ గవర్నర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రసంసించారు. తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు.
ALAY BALAY: 'తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్-బలయ్'