మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించొద్దని దుకాణ యాజమానులకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. పాదచారులు నడిచేందుకు ఉన్న వాటిని ఇతర పనుల కోసం ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. పది రోజుల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బస్సులు, ఆటోలు నిలిపేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఇవీ చూడండి:బ్యాంకుల పాత్ర గొప్పది