విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్, భజరంగ్ దళ్, భాజపా పార్టీలు ప్రజల్లో మత విద్వేషాలను పెంపొందిస్తున్నాయని ఎంఐఎం శాసన సభాపక్షనేత అక్బరుద్ధీన్ ఓవైసీ ఆరోపించారు. బాబ్రీ మసీదు అంశంపై అద్వాని దేశ ప్రజల్లో మత విద్వేషాన్ని పెంపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
దేశాన్ని మతం పేరుతో ముక్కలు చెయ్యాలని చూస్తున్నారని అక్బరుద్ధీన్ మండిపడ్డారు. ముస్లింల మనోభావాలకు అనుగుణంగా తీర్పును రివ్యూ చేసుకునే అవకాశం చట్టంలో ఉందని... దీనిని వినియోగించుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: మరో ఏడాది గడిచే.. పౌర బాధ్యతకు ఏదీ మన్నన?