ETV Bharat / state

'అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై చర్యలు తీసుకోండి'

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఇంటర్ బోర్డు తీరును వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని కార్యాలయాన్ని ముట్టడించింది. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని సమాఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

aisf-protest-at-inter-board-office-at-nampally-in-hyderabad
అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్​ఎఫ్
author img

By

Published : Feb 12, 2021, 1:23 PM IST

ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు బైఠాయించి... రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా సమాఖ్య నాయకులు నినాదాలు చేశారు. గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించగా... బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఫీజులపై ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ ఆరోపించారు. అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు 46జీవోను ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని... లేదంటే అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.