ETV Bharat / state

పాత పెన్షన్​ విధానం అమలుకై ఎయిర్​ఫోర్స్​ ఉద్యోగుల ధర్నా! - Hakeempet Airforce Acadamy

ఎయిర్​ఫోర్స్​ ఉద్యోగులకు పాత పెన్షన్​ విధానాన్నే అమలు చేయాలని ఎయిర్​ఫోర్స్​ సివిలియన్​ ఎంప్లాయిస్​ యూనియన్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్​ విధానాన్ని రద్దు చేయాలని.. పాత పెన్షన్​ విధానమే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. పెన్షన్​ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని యూనియన్​ ఉపాధ్యక్షులు రంజిత్​ అన్నారు.

Air Force Employees union Protest For Previous pension scheme
పాత పెన్షన్​ విధానం అమలుకై ఎయిర్​ఫోర్స్​ ఉద్యోగుల ధర్నా!
author img

By

Published : Sep 7, 2020, 3:07 PM IST

ఎయిర్ ఫోర్స్​ ఉ​ద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఎయిర్​ఫోర్స్​ సివిలియన్​ ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నాకు దిగింది. సికింద్రాబాద్​ హకీంపేట్​లోని ఎయిర్​ఫోర్స్​ అకాడమీ ఎదురుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎయిర్​ఫోర్స్​ ఉద్యోగులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్​ విధానాన్నే మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు.

పెన్షన్​ ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని ఎయిర్​ఫోర్స్​ సివిలియన్​ ఎంప్లాయిస్​ యూనియన్​ వైస్​ ప్రెసిడెంట్ రంజిత్​ అన్నారు. పెన్షన్​ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే.. యూనియన్​ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.

ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.