ETV Bharat / state

గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్ నూతన రథసారథి పావులు

author img

By

Published : Sep 18, 2020, 5:00 AM IST

రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి కొత్త రథసారథిని నియమించింది. రాబోయే జీహెచ్​ఎంసీ... ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు, దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు హైకమాండ్‌ దిశానిర్దేశం చేస్తోంది.

గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్ నూతన రథసారథి పావులు
గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్ నూతన రథసారథి పావులు
గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్ నూతన రథసారథి పావులు

దీర్ఘకాలంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న కుంతియాకు ముగింపు పలికిన కాంగ్రెస్‌... తమిళనాడుకు చెందిన ఎంపీ మానిక్కం ఠాగూర్‌ను సారథిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కుంతియాను మార్చాలన్న డిమాండ్‌ హస్తం పార్టీలో తరచూ వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని, సకాలంలో అభ్యర్థుల ఎంపిక చేయకపోవడం వల్లనే పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త సారథిపై విశ్వాసం ఉంచి పార్టీని మళ్లీ గెలుపు బాట పట్టించాలని అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.

పరిస్థితులపై దృష్టి..

మానిక్కం ఠాగూర్‌ నియమితులైన వెంటనే రాష్ట్ర పరిస్థితులపై దృష్టిసారించారు. జూమ్‌ యాప్‌ ద్వారా 3 గంటలపాటు పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సుదీర్ఘ సమావేశంలో పార్టీ స్థితిగతులు, అధికార పార్టీ దూకుడుతో పాటు ఇతర పార్టీల గురించి ఠాగూర్‌ ఆరా తీశారు. జరగబోయే జీహెచ్​ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలతోపాటు... దుబ్బాక ఉపఎన్నిక... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేయాలని మానిక్కం ఠాగూర్‌ స్పష్టం చేశారు.

ఒకతాటిపై..

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లి... క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రస్తుతం లోక్‌సభ సమావేశాల్లో ఉన్న ఠాగూర్‌ త్వరలోనే రాష్ట్రంలో మకాం వేసి... పార్టీలోని లోటుపాట్లను గుర్తించి చక్కదిద్దే వ్యూహాలు రచిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాయకుల మధ్య అంతర్గతంగా విబేధాలు ఉన్నప్పటికీ... ఇంఛార్జి చురుగ్గా ఉంటే అందరిని ఒకతాటిపైకి తీసుకురాగలరనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: ముప్పారం త్రికూటాలయాన్ని సంరక్షించాలని కేంద్రానికి గవర్నర్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.