వ్యవసాయ సంస్కరణల పేరిట తీసుకొస్తున్న బిల్లులను తిప్పకొట్టాలంటూ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) పిలుపునిచ్చింది. ఈనెల 25న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ అదేరోజున.. రాస్తారోకోలు చేయాలని కోరింది.
హైదరాబాద్ హియాయత్‌నగర్ ముఖ్ధూం భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో అఖిలపక్ష రైతు నేతలు వేములపల్లి వెంకటరామయ్య, కన్నెగంటి రవి, కొండల్‌రెడ్డి, అచ్యుతరామయ్య పాల్గొన్నారు.
మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ 250 రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా తెలంగాణలో చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు.
రాష్ట్రంలోని జాతీయ రహదారులు గంటపాటు దిగ్బంధం, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు.