ETV Bharat / state

గవర్నర్​ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం : దాసోజు శ్రవణ్ - తెలంగాణ ప్రభుత్వం

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర గవర్నర్​ తమిళిసై చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్టు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. కరోనా విషయంలో గవర్నర్​ రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Aicc Spokes Person Dasoju Sravan Welcomes Governor Comments on Telangana Government
గవర్నర్​ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం : దాసోజు శ్రవణ్
author img

By

Published : Aug 19, 2020, 10:24 PM IST

గవర్నర్​ తమ అధికారాన్ని ప్రయోగించి.. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలతో ఆదేశాలు జారీ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న గవర్నర్​ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నట్టు ఆయన తెలిపారు.

కరోనా విషయంలో కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్పినా తెరాస ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నర్​ కూడా ఇదే మాట చెప్పారని, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నందున కనీసం గవర్నర్​ మాటలతో కాకుండా.. ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. భాజపా నాయకులు రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తీసుకోవాల్సిన చర్యలకై ఒత్తిడి పెంచాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.