ETV Bharat / state

రఘునందన్​రావుకు అభినందనలు : దాసోజు శ్రవణ్​కుమార్ - గాంధీభవన్​ వార్తలు

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం సీఎం కేసీఆర్​కు చెంపపెట్టులాంటిదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్ అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలకున్న తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. విజయం సాధించిన భాజపా అభ్యర్థికి ఆయన అభినందనలు తెలియజేశారు.

AICC Secretery dasoju sravankumar comments dubbaka by poll result on kcr
దుబ్బాక ఫలితం కేసీఆర్​కు చెంపపెట్టు : దాసోజు శ్రవణ్​కుమార్
author img

By

Published : Nov 10, 2020, 6:41 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో సీఎం కేసీఆర్​కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్ విమర్శించారు. మల్లన్నసాగర్​ రైతుల ఉసురు ఇక్కడ తగిలిందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో దుబ్బాకలో గెలవాలన్న సీఎంకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.

ఈ ఎన్నికలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్​రావుకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్​కు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దుబ్బాకలో ఓటమిపై లోతైన సమీక్ష నిర్వహిస్తామని...కార్యకర్తలెవ్వరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.