సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌ను కాపాడేందుకు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ కేంద్ర ప్రభుత్వ పథకమైన 'భేటీ పడావో భేటీ బచావో' పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారని ఆయన వివరించారు.
గతంలో హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని... వారిపై రోజుల తరబడి విచారణ జరిపిన తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ముంబయి డ్రగ్స్ మాఫియా కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దలు బాగోతాలు బయట పడతాయని సంపత్ కుమార్ అన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె