ETV Bharat / state

'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సి​ద్ధమని తెరాస నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు.

AICC Secretary Challa Vamsichand Reddy fire on trs government
'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'
author img

By

Published : Aug 8, 2020, 8:00 PM IST

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు జలదోపిడి, సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సి​ద్ధమని తెరాస నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే.. ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

నిజంగా ప్రభుత్వానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్ లిస్ట్ చేయడమెగాక... గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని వంశీచంద్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పి) కాదని, కేవలం అప్లికేషన్ ఫర్ డైరెక్షన్స్ (ఆదేశాల కోసం దరఖాస్తు) మాత్రమేనని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్లకు అనుకూలంగా కేసును నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.

బహిరంగ చర్చ సందర్భంగా, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కాకుండా కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరుని బహిర్గతంచేసి, తెరాస ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు.

ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.