దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆరోపించారు. 'మేక్ ఇన్ ఇండియాను సెల్ ఇన్ ఇండియా'గా మార్చుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. దేశ వాణిజ్యం ఇప్పటికే లోటులో ఉందని...ఇక చైనాతో వ్యాపారం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని గౌరవ్ పేర్కొన్నారు. చైనా వస్తువులు ఇండియాలో విచ్చలవిడిగా ఉంటే రైతులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. ఇండియా చైనా ఒప్పందాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. దేశాన్ని డంపింగ్ యార్డు చేసేందుకు భాజపా ఇలాంటి ఒప్పందాలు చేస్తుందని గౌరవ్ దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య