కరోనా నివారణపై ప్రభుత్వం చేతులెత్తేసిందని... వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు లేవని... ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయాన్ని కోవిడ్ అసుపత్రిగా మార్చాలని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్ టెస్టులు ఉచితంగా చేసి... చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు.
కరోనా లక్షణాలుంటేనే కొవిడ్ పరీక్ష చేయాలనే నిబంధనను పాటించకుండా... ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రులు అవసరం లేకపోయినా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రోజుకు లక్ష రూపాయలు కట్టనిదే ఏ ఆసుపత్రిలో కూడా... కోవిడ్ రోగిని చేర్చుకోవడంలేదని వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి బయట వాటిలో ఉన్న బెడ్ల సంఖ్య... ఖాళీగా ఉన్న బెడ్ల సంఖ్యను ప్రదర్శించాలన్నారు.
ఇదీ చూడండి: పట్టణాల్లో పనుల్లేవ్.. నిరుద్యోగం పెరుగుతోంది!