కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా వస్తుందని ఆశించగా... నిరాశే ఎదురైందని వాపోయారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కీలక వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని 2008 నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ... కేవలం ఒక్క పశుగ్రాసం పెంపకానికి చేయూతనిస్తామని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం తమకు బాధ కలిగిందన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి... కేంద్ర బడ్జెట్‌పై నిరాశ వ్యక్తం చేశారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే... తెలంగాణ సానుకూల విధానాలను ప్రశంసిస్తూ... వ్యవసాయానికి అండగా ఉండకపోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:- బడ్జెట్‌పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం