ఏపీ సీఎం జగన్ వందరోజుల పాలన బాగుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కితాబిచ్చారు. అభివృద్ధి చేసేందుకు జగన్ ఎంతో కృషిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీలో పర్యటించిన మంత్రి... విశాఖపోర్ట్, గంగవరంపోర్టులను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో కలసి సందర్శించారు. విశాఖ పోర్ట్, గంగవరం పోర్టుల నుంచి యూరియా సత్వర రవాణాకు ఏపీ అధికారులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. యూరియా, ఎరువుల రవాణాకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా... రబీకి కూడా యూరియా నిల్వలు సిద్ధం చేస్తున్నామన్నారు. యూరియా సత్వర రవాణాకు పోర్ట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన గంగవరం పోర్టు సీఈఓ నండూరి సాంబశివరావుకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్ట్ అధికారులతో మంత్రి బృందం సమావేశమైంది. గంగవరం పోర్టులో వియత్నాం నుంచి వచ్చిన యూరియా నౌకను సందర్శించారు.
ఇవీ చూడండి: బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...!