మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈశ్వరీ బాయి జీవిత నేపథ్యంలో నిర్మించిన లఘు చిత్రం 'అగ్నిశిఖ ది ఫైర్ బ్రాండ్' నాలుగో ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్- 2020 స్ర్కీనింగ్‌కు ఎంపికైంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకుంది ఈ లఘు చిత్రం. ఈ క్రమంలో వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం పట్ల ఈశ్వరీబాయి తనయ గీతారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
నిరంతరం వారి అభివృద్ధి కోసమే
ఈశ్వరీ బాయి జీవితంలోని పలు అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు ఆమె వెల్లడించారు. ఈశ్వరీ బాయి ఒక సమాజ సేవకురాలిగా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేశారని గీతారెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత లేని ఆ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి రాజకీయ, ఆర్థిక అండదండలు లేకుండనే సమాజానికి తన వంతుగా సేవలందించారని గీతారెడ్డి గుర్తు చేశారు.
ఇవీ చూడండి : అంచున 'కమల్' సర్కార్- 12న కమలం గూటికి సింధియా!