సీఏఏను రద్దు చేయాలంటూ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు హైదరాబాద్లో తెలిపారు.
ఎన్పీఆర్ నిబంధనలు పూర్తిగా దళిత, గిరిజన, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అందులోని ప్రశ్నలకు సరైన ఆధారాలు చూపని వారు పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు ఈ ప్రక్రియతో నిర్బంధ గృహాలకు తరలించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.