రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. ఇది క్రమంగా రాగల 2 రోజులలో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఆగస్టు 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్