ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతకు... కడప న్యాయవాది సుబ్బారాయుడు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలుంటే సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సుబ్బారాయుడు రాసిన లేఖపై ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు... సునీతకు రాసిన లేఖను కేంద్ర గ్రీవెన్స్ సెల్‌కు సైతం సుబ్బారాయుడు పంపారు.
37వ రోజు సీబీఐ విచారణ
వైఎస్ వివేకా హత్యకేసులో 37వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో నేడు ఐదుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్మెన్ రంగన్న, ఇద్దరు కుమారులతోపాటు పులివెందుల పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: సీబీఐకి వివేక హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం