Adulteration Cakes Gangs arrested in Hyderabad : ఈరోజుల్లో పండుగ, పుట్టిన రోజులు సహా ఏ శుభసందర్భాలేవైనా కేకులు, మిఠాయిలు తప్పనిసరి. అలాంటి కేకులు, మిఠాయిలు తినాలంటే ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పన్నాగం పన్నిన అక్రమార్కులు.. కల్తీ పదార్థాలతో బురిడీ కొట్టిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అపరిశుభ్ర వాతావరణం, కల్తీ పదార్థాలతో సొమ్ము వెనకేసుకునేందుకు తెగిస్తున్నారు. తాజాగా అలాంటి ముఠాల ఆట కట్టించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- Kalti ice cream in Hyderabad : మీ పిల్లలు తింటోంది ఐస్‌క్రీమా లేక చల్లని విషమా..?
- మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!
రాజధానిలో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిన్న బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో విస్తుపోయే విషయాలు గుర్తించారు. స్థానికంగా కేకుల తయారీ కేంద్రాన్ని నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న గోపాలకృష్ణ.. అపరిశుభ్ర వాతావరణంలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కేకులను బేకరీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి విస్తుపోయిన పోలీసులు.. కేక్ మాస్టర్ సయ్యద్ వాసిఫ్‌ను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు గోపాలకృష్ణ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Making adulterated sweets in oldcity Hyderabad : ఏమాత్రం పరిశుభ్రత పాటించకుండా తయారు చేస్తున్న ఇలాంటి కేకుల్ని తినడం వల్ల జీర్ణసంబంధిత వ్యాధులతోపాటు అనారోగ్యానికి గురవుతారని పోలీసులు తెలిపారు. మరోపక్క పాతబస్తీ మొఘల్‌పురా పీఎస్ పరిధిలో కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం బాల్‌గోపాల్ యోజన కింద ఇస్తున్న మిల్క్ పౌడర్‌ని రాజస్థాన్ నుంచి అక్రమంగా హైదరాబాద్ తీసుకొచ్చి ఈ స్వీట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
Adulteration ice creams in Hyderabad : పాలల్లో డాల్డా, ఇతర పదార్థాలు కలిపి సరైన ప్రమాణాలు పాటించకుండా మిఠాయిలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సామాగ్రిని స్వాధీనం చేసుకుని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. మిఠాయిల నమూనాలను ల్యాబ్‌కి పంపారు. తాజాగా పట్టుబడిన కేక్, మిఠాయిలే కాదు నెల రోజుల క్రితం పోలీసులు, అధికారులు చేసిన వరుస దాడుల్లో కల్తీ ఐస్ క్రీం, చాక్లెట్లు తయారు చేస్తున్న నిందితులు పట్టుబడ్డారు. వేసవి కాలంలో చిన్నారులు ఎక్కువగా తినే ఐస్ క్రీంలు, చాక్లెట్లతో పాటు పలు రకాల తినుబండారాలను కల్తీ చేసి వాటిని బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: