హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాంబాగ్‌లోని ప్రతీ పేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులను ట్రస్ట్ వ్యవస్థాపకులు నంద కిషోర్ బిలాల్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని... మీ కాలనీకే వచ్చి సరకులు అందిస్తామని ట్రస్ట్ వ్యవస్థాకులు తెలిపారు.
ఇదీ చూడండి: పనులు కరువై... బతుకు బరువై...