Additional DGP On GO No 1: ఆంధ్రప్రదేశ్‌లో సభలు, రోడ్‌షోలు ఆపేందుకు జీవో తెచ్చారనడం సరికాదని.. అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. కీలక ప్రాంతాల్లో మాత్రమే నియంత్రించాలని చెప్పామని.. సభలు, రోడ్ షోలకు అనుమతి కోరితే పరిశీలించి ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సభకు జనసేన అనుమతి కోరితే ఇచ్చామన్నారు.
"సభలు, రోడ్‌షోలు ఆపేందుకు జీవో తెచ్చారనేది నిజం కాదు. కేవలం కీలక ప్రాంతాల్లో మాత్రమే నియంత్రించాలని చెప్పాం. సభలు, రోడ్ షోలకు అనుమతి కోరితే పరిశీలించి ఇస్తాం" -రవిశంకర్ అయ్యన్నార్, అదనపు డీజీపీ
సరైన బదులివ్వనందుకే: కుప్పంలో అనుమతి కోరినవాళ్లు పోలీసులు అడిగిన కొన్ని అంశాలపై సరైన బదులివ్వకపోవడం వల్లే అక్కడ చంద్రబాబు రోడ్డుషోకు అనుమతి ఇవ్వలేదన్నారు. కందుకూరు, గుంటూరు ఘటనల దృష్ట్యా జీవో జారీ చేశామని చెప్పారు. జనవరి 27 నుంచి నిర్వహించే లోకేశ్ పాదయాత్రకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపారు. లోకేశ్ పాదయాత్ర కొనసాగే ప్రాంతాలను ఎస్పీలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఇవీ చదవండి: