ETV Bharat / state

SONU SOOD: మంత్రి కేటీఆర్​ను కలిసిన నటుడు సోనూసూద్​

కరోనా విపత్తు వేళ రియల్ హీరోగా మారిన నటుడు సోనూసూద్(actor sonusood)​ మంత్రి కేటీఆర్(minister ktr)​ను కలిశారు. దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్​ రమేశ్​లతో కలిసి హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోన్న రియల్​ హీరోకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి కేటీఆర్​ను కలిసిన నటుడు సోనూసూద్​

author img

By

Published : Jul 6, 2021, 3:44 PM IST

Updated : Jul 6, 2021, 9:54 PM IST

కరోనా ఆపత్కాలంలో సాయమడిగిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ రియల్​ హీరోగా మారిన ప్రముఖ నటుడు సోనూసూద్(actor sonusood)​.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​(minister ktr)ను కలిశారు. దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్​ రమేశ్​లతో కలిసి హైదరాబాద్​లో కేటీఆర్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులు, సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో ముచ్చటించారు.

దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్​ రమేశ్​లతో కలిసి కేటీఆర్​తో భేటీ

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్(minister ktr)​ భరోసా ఇచ్చారు. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోన్న సోనూకు కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని కోరారు.

సమావేశ అనంతరం మంత్రి కేటీఆర్.. సోనూసూద్​కు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి.. ఒక మెమొంటోను అందజేశారు.

మెమొంటోతో సత్కారం
మెమొంటోతో సత్కారం

మాటలు సరిపోవడం లేదు..

కేటీఆర్ చూపిన ఆప్యాయత, ప్రేమకు సోనూసూద్​ ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ ఆతిథ్యానికి మాటలు సరిపోవడం లేదన్నారు. మరిన్ని జీవితాల్లో కేటీఆర్‌ చిరునవ్వులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేటీఆర్ ఓ విజనరీ నాయకుడని ప్రశంసించారు.

  • Thank you so much for all the love and warmth my brother @KTRTRS , I have no words to thank you for your hospitality. May the almighty guide us to bring many more smiles to the needy. You are a visionary, a leader who sets an example of empathy. 🇮🇳 pic.twitter.com/2TAM0yWZPz

    — sonu sood (@SonuSood) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలోనూ..

గతంలోనూ మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా సోనూసూద్​పై ప్రశంసలు కురిపించారు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. రియల్​ హీరో అంటూ కొనియాడారు. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని కోరారు.

ఏం జరిగిందంటే..

నందకిశోర్ అనే వ్యక్తి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కోసం మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అతనికి కావాల్సిన సాయాన్ని అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి తనకు సాయం చేసిన కేటీఆర్​కు నందకిశోర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మీరు హీరో అంటూ కొనియాడారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. నేను ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని.. వారికి సేవ చేయడం నా బాధ్యత అని తెలిపారు. ఎలాంటి పదవి లేకున్నా.. ఏం ఆశించకుండా ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవ చేస్తున్న సోనూసూద్ అసలైన హీరో అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

మీరూ ఎంతో చేశారు..

కేటీఆర్​ ట్వీట్​పై సోనూసూద్ స్పందించారు. తన గురించి మంచి మాటలు చెప్పిన కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా కేటీఆర్.. తెలంగాణకు ఎంతో చేశారని సోనూ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని.. తనకు పని కల్పిస్తున్న రాష్ట్రమని.. తెలంగాణ ప్రజలు తనను ఎంతగానో అభినందిస్తున్నారని ట్వీట్ చేశారు.

త్వరలోనే తెలంగాణలో..

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే సోనూసూద్​.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో ఆక్సిజన్​ ప్లాంట్​ కొనుగోలు చేసి ఇప్పటికే ఏపీలోని నెల్లూరు జిల్లాకు పంపించారు. త్వరలోనే తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నానని తెలిపారు.

ఇవీ చూడండి..

Last Updated : Jul 6, 2021, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.