Actor Mohan Babu: నటుడు మోహన్‌బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పనిచేస్తారని అన్నారు. తిరుపతిలో విశాల్ 'లాఠీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్‌బాబు.. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటున్నారన్నారు. పోలీసులంటే గౌరవం అన్న ఆయన.. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్తానని స్పష్టం చేశారు.
"సర్ నేను ఇతడు తప్పు చేయటం చూశాను అని పోలీసులు చేప్తే అతని ఉద్యోగం పోతుంది. పోలీసు పై అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారు. నేను ఎప్పటికీ పోలీస్ శాఖకు గౌరవం ఇస్తాను." - మోహన్‌బాబు, నటుడు
ఇవీ చదవండి: