ETV Bharat / state

పోలీసుల కస్టడీలో హరిహరకృష్ణ.. కీలక ఆధారాల కోసం సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌

Hariharakrishna in Police Custody: నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. నిందితుడు డిలీట్ చేసిన వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను రిట్రివ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు కీలక ఆధారాల కోసం సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేపట్టనున్నారు.

Naveen murder case
Naveen murder case
author img

By

Published : Mar 3, 2023, 2:38 PM IST

Updated : Mar 3, 2023, 6:08 PM IST

Hariharakrishna in Police Custody: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిహరను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి సరూర్‌నగర్​లోని ఎస్​వోటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈనెల 9వరకు హరిహరను ప్రశ్నించనున్నారు.

నవీన్​ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా ? లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత చాలాసేపు ఘటనా స్థలంలోనే ఉన్న హరిహరకృష్ణ అనంతరం ఆధారాలు చెరిపివేశాడు. హత్య చేసిన తర్వాత నవీన్ చరవాణిని ధ్వంసం చేసి బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న చెట్లపొదల్లో పడేశాడు. నవీన్ చరవాణిని రికవరీచేయడంతో పాటు, హరిహరను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు. హత్య ఒక్కడే చేశాడా.. ఎవరన్న సహకరించారా.. అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. హరిహరకృష్ణతో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించనున్నారు.

తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని హరిహరకృష్ణ నవీన్‌పై పగ పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతనిని ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడని వివరించారు. ఇందుకోసం మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించాడని తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్‌లో కత్తి కొనుగోలు చేశాడని వివరించారు. గత నెల 17న హరిహరకృష్ణ, నవీన్ ఓఆర్ఆర్ సమీపంలో మద్యం తాగారని తెలిపారు.

మద్యం మత్తులో యువతి విషయం ప్రస్తావనకు రావడంతో ఇరువురి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో హరిహరకృష్ణ నవీన్​ గొంతునులిమి దారుణంగా హత్య చేశాడని వివరించారు. అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి తల, వేళ్లు, ఇతర భాగాలు బ్యాగులో వేసుకొని వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లికి చేరుకొని నవీన్‌ అవయవాలు పారేశాడని చెప్పారు. హత్య విషయాన్ని బ్రాహ్మణపల్లికి చెందిన స్నేహితుడు హసన్‌, ప్రేమించిన యువతికి.. హరిహరకృష్ణ చెప్పాడని అన్నారు.

ఎందుకు సమాచారం ఇవ్వలేదనే విషయంపై పోలీసులు ఆరా: ఈ దారుణం గురించి తెలిసినా.. వీరిద్దరూ ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారిస్తున్న పోలీసులు వీరు హరిహరకృష్ణకు సహకరించారని భావిస్తున్నారు. కానీ వారు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తేలింది. నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణకు ఆశ్రయం ఇచ్చిన హసన్‌ను పోలీసులు విచారించారు. ఇదే విషయమై యువతిని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం కాగా.. ఈ కేసులోకి తనను లాగితే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 3, 2023, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.