ETV Bharat / state

Accidents On ORR : నెత్తురోడుతున్న బాహ్యవలయరహదారి

author img

By

Published : Dec 29, 2021, 5:30 AM IST

భాగ్యనగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగురోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. కొరవడిన పర్యవేక్షణ, శాఖల సమన్వయలోపాల వల్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వేగం కన్నా ప్రాణం మిన్న అని తెలిసిన వారంతా కూడా వేగంగా నడుతూనే ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అతివేగం, అజాగ్రత్త వెరసి ఆయువును బలిగొంటున్నాయి.

Accidents On ORR
Accidents On ORR

బాహ్యవలయదారి మహానగరానికి మణిహారం. పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు సాఫీగా ప్రయాణం సాగించేందుకు 158 కిలోమీటర్ల మేరకు విస్తరించిన మార్గం. నిత్యం 1-1.5లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. అయితే ఏటా... ఓఆర్ఆర్‌ మార్గంలో 250-300కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 55-60 మంది మృత్యువాత పడుతున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారాంతపు సమయాల్లో ఖరీదైన కార్లలో రహదారిపైకి చేరిన కుర్రకారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

కానరాని నిబంధనలు

బాహ్యవలయ రహదారి ప్రవేశ మార్గాలు(ఇంటర్‌ఛేంజ్‌) వద్ద నిబంధనలపై అవగాహన కల్పించాలనే నియమం ఉంది. ఔటర్‌పై 19 రహదారి ప్రవేశమార్గాల్లో ఎక్కడా నిబంధనలు కనిపించవు. గతంతో పోల్చితే పోలీసు గస్తీ, స్పీడ్‌ లేజర్​గన్‌ల నిఘాతో కొద్దిమేర పరిస్థితి అదుపులోకి వచ్చినా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మరళా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ మార్గంలో ప్రయాణంపై అవగాహన లేకపోవటం, మితిమీరిన వేగం, కేటాయించిన వరుసలు(లైన్ల)ను వదిలేసి పక్క వరుసలోకి వెళ్లటం ప్రమాద తీవ్రతకు కారణమంటున్నారు పోలీసులు. రాచకొండ, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంచార వాహనాలపై స్పీడ్​లేజర్‌ గన్‌లతో ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. కెమెరాకు చిక్కిన వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు.

ఎవరు ఏ వరుసలో వెళ్లాలి

బాహ్యవలయంలో 4 వరుసలుంటాయి. 1-2లో కార్లు, 4-5 వరుసల్లో లారీలు, భారీవాహనాలు ప్రయాణించాలి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు వేగానికి అనుగుణంగా ఏయే వరుసల్లో వెళ్లాలనే దానిపై నిబంధనలున్నాయి. ఇవన్నీ తెలియక వాహనదారులు ఇష్టం వచ్చినట్టుగా వరుసల్ని మార్చుకుంటూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధికవేగంతో ప్రయాణించే వాహనాలు డివైడర్‌ వైపు నుంచి మొదటి రెండు వరుసల్లో మాత్రమే వెళ్లాలి. వేగాన్ని తగ్గించాలని అనుకుంటే వెనుక వైపు మరో వాహనం రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాతే పక్క వరుసల్లోకి వెళ్లాలి. వాహనాలను ఓవర్‌టేక్‌ చేసి ముందుకెళ్లే తొందరలో ఇష్టానుసారం వరులను మార్చుతూ దూసుకెళ్తున్నారు. ఎదురుగా ఉన్న వాహన వేగం అకస్మాత్తుగా తగ్గించటం/నిలిపివేయటంతో వెనుక నుంచి ఢీకొడుతున్నారు. అప్పటికే 120-160 వేగంతో వాహనం ప్రయాణిస్తుండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రమాదకరంగా మారిన రహదారి
ప్రమాదకరంగా మారిన రహదారి

మచ్చుకు కొన్ని..

ఇటీవల సరూర్‌నగర్‌కు చెందిన ఫాస్టర్‌... ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఎగుడుదిగుడుగా ఉన్న మార్గంలో వాహనాన్ని అదుపుచేయలేక ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా బాహ్యవలయం హిమాయత్‌సాగర్‌ సమీపంలో ముందు వెళ్తున్న లారీను బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతు కోసం పై భాగంలో తవ్వటంతో వాహనాలు పక్కకు జారిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 6-7 ప్రమాదాలకు కారణమయ్యాయని స్థానికులు తెలిపారు.

ఆ రెండురోజులే హడావుడి..

ఏదైనా ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసే పోలీసులు ఆ తరువాత చేతులెత్తేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రిళ్లు వాహనం నడుపుతూ తెల్లవారుజాము 3-4 సమయంలో నిద్రమతత్తులోకి జారుకుంటున్నారు. ప్రస్తుతం పొగమంచు కూడా తోడవటంతో వాహనాలను కనిపించక ప్రమాదాల బారినపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

సైబరాబాద్‌ పరిధిలో ఔటర్‌పై ప్రమాదాలు

సంవత్సరం20202021
ప్రమాదాలు140191
క్షతగాత్రులు114158
మృతులు2633

రాచకొండ పరిధిలో ఔటర్‌పై ప్రమాదాలు

సంవత్సరం20202021
ప్రమాదాలు3127
క్షతగాత్రులు3528
మృతులు1512

ఇదీ చూడండి: Himayat Sagar Accident: లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.