హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కూరగాయల లోడుతో వస్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దేవాలయాన్ని ఢీకొట్టింది. ఆలయం చుట్టు ఉన్న ఇనుప చువ్వలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం