కరోనా నివారణ కోసం ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆక్సిస్ ఫౌండేషన్ కొవిడ్ బాధితులకు నిరంతరం సేవలందిస్తోంది. లాక్డౌన్ వల్ల ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న రోగులకు ఇంటి వద్దకు వచ్చి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్నందున గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని వందమంది బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్