లాక్డౌన్ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న సుమారు 60 కట్టడాలను కూలగొట్టడం జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గత 15 రోజులుగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రణాళికలతో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి : 'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది'